![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -472 లో..... ఒక్క దీప తప్పు ఒప్పుకోవడం వల్ల రెండు కుటుంబాలు కలుస్తాయని శ్రీధర్ అంటాడు. నా భార్య ఏ తప్పు చెయ్యలేదు ఒప్పుకోదని కార్తీక్ అంటాడు. ఇక నిర్ణయం నీదే దీప అని శ్రీధర్ అంటాడు. ఇది నా కుటుంబం.. దానికి సంబంధించిన సలహాలు సూచనలు నువ్వేం ఇవ్వనవసరం లేదని కార్తీక్ కోపంగా అరుస్తాడు. సరే నీ కుటుంబం కదా అని శ్రీధర్ డల్ గా వెళ్లిపోతాడు.
మరొకవైపు అసలు ఇంట్లో పనిమనిషికి ఉన్న విలువ ఇంటికోడలికి లేదని జ్యోత్స్న అంటుంది. ఏం మాట్లాడుతున్నావని దశరథ్ అంటాడు. మరి తప్పు చేసింది ఒప్పుకోవచ్చు కదా అని జ్యోత్స్న అనగానే దీప తప్పు చేయలేదు.. మరి నువ్వు తప్పు చేసావ్ కదా ఒప్పుకున్నావా అని దశరథ్ అడుగుతాడు. నేనేం తప్పు చేసానని జ్యోత్స్న అంటుంది. అసలు దీప చేతిలోకి గన్ ఎలా వచ్చిందని దశరథ్ అనగానే నా దగ్గర నుండి తీసుకుందని జ్యోత్స్న అంటుంది. అసలు నీ చేతిలోకి ఎలా వచ్చిందని దశరథ్ అడుగుతాడు. దీప ఏమైనా చేస్తుందోనని తాత గన్ తీసానని జ్యోత్స్న అంటుంది. అయితే దీపకి కోపం వచ్చేంత తప్పేం చేసావని దశరథ్ అడుగుతుంటే జ్యోత్స్న డైవర్ట్ చేస్తుంది. దీపని నమ్ముతున్నావ్.. మూర్ఖుడివి అని దశరథ్ ని జ్యోత్స్న అంటుంది. దాంతో జ్యోత్స్న చెంపచెల్లుమనిపిస్తుంది సుమిత్ర.
ఆ తర్వాత జ్యోత్స్న చెంపకి పారిజాతం ఆయింట్మెంట్ రాస్తుంది. మరొకవైపు దీప దగ్గరికి కార్తీక్ వచ్చి జరిగింది మర్చిపోమని చెప్తాడు. ఆ తర్వాత శ్రీధర్ దగ్గరికి స్వప్న కావేరి వస్తారు. రెండు కుటుంబాలు కలిసే ఛాన్స్ వస్తే మీ వదిన మిస్ చేసింది. అసలు కార్తీక్ కి ఈ పరిస్థితి రావడానికి కారణం దీప అని శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |